మన న్యూస్ లింగంపెట్ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, బాణాపూర్ గ్రామ సబ్ స్టేషన్ నందు 1 కోటి రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన 3.15 యం.వి.ఏ పిటిఆర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు నూతనంగా ఏర్పాటు చేసిన 3.15 యం.వి.ఏ పిటిఆర్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ సమ్మర్ ఆక్షన్ ప్లాన్ లో భాగంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో లో వోల్టాజి సమస్యను నివారించాలని గ్రామస్థులు, రైతులు కోరడంతో అదనంగా ఒక కోటి రూపాయల నిధులతో 3.15 యం.వి.ఏ పిటిఆర్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. చుట్టు పక్కన ఉన్న 8 గ్రామాలకు లో వోల్టేజి సమస్య పూర్తిగా తొలగనుంది అని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యుత్ అధీకారులకు మండల విద్యుత్ అధికారులకు, డీఈ, ఏడీఈ, ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.