మన న్యూస్ : వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్పి రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన రైతులు, ఏఓ ఏఈఓ లు రైతులు తమ పొలంలో వరి కోసిన తర్వాత ఎవరు కూడా వరి కోయకాలను కాల్చవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రైతులకు సూచించారు. హైదరాబాద్ సచివాలయం నుంచి రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో రైతులతో ముచ్చటించారు. వరి కోయకాలను కాల్చడం వలన నేలలో ఉండే సేంద్రీయ కార్జనం, పంట పెరుగుదలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు నశించడంతోపాటు పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతుందన్నారు. పంట అవశేషాలను, వరి కోయలను నేలలు కలియదున్ని సింగిల్ సూపర్ ఫాస్పేట్ వేయడం ద్వారా మంచి ఎరువుగా తయారై పంట ఎదుగుదలకు తోడ్పడి నేల సారవంతం అవుతుంది అన్నారు. పంట అవశేషాలు వరికోయలను కాల్చిన పర్యావరణ కాలుష్యానికి పాల్పడిన ప్రభుత్వం చట్టరీత్య చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. రైతులు ఎట్టి పరిస్థితులలోనూ వరి మాటలను కాల్చవద్దని కోరారు. అనంతరం వరి ధాన్యం పత్తి పంట కొనుగోలు విషయమై మాట్లాడుతూ. రైతులకు ఇబ్బంది తలెత్తకుండా ఆయా శాఖల అధికారులు చర్యలు చూసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలనుంచి రైతుల ధాన్యం మిల్లర్లకు చేరిన 48 గంటల లోపు వారి అకౌంట్లో డబ్బు జమ చేయడం జరుగుతుందన్నారు. పినపాక మండల కేంద్రంలో రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ కు మండల వ్యవసాయ అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఓ వెంకటేశ్వర్లు, ఏ ఈ ఓ లు రమేష్, నాగేశ్వరరావు రైతులు తదితరులు పాల్గొన్నారు.