మన న్యూస్, గూడూరు, మే 13:తిరుపతి జిల్లా గూడూరు పట్టణం కి సమీపంలో ఉన్న పోటు పాలెం, చలివేంద్ర గుంట ఎస్టీ కాలనీ లో ఉన్న 70 మంది నిరుపేదలకు ఈ రోజు 13-5-2025 వ తేదీన మంగళవారం. యంగల ప్రేమ్ కుమార్, ప్రసన్న దంపతుల యంగల,ప్రణయ చిన్నారి,జన్మదిన సందర్భంగా కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు కేకు, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య దాతగా వ్యవహరించిన తాత,కసుకుర్తి కోటేశ్వరరావు అమ్మమ్మ భారతి దంపతుల పూర్తి సహాయ సహకారాలతో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.భారతి మాట్లాడుతూ......మా మనవరాలు యంగల,ప్రణయ పుట్టినరోజు వేడుకలు ఆడంబరంగా జరుపుకోకుండా పేదలకు సహాయం చేస్తే అందులో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదన్నారు. పుట్టినరోజున వృద్ధులకు, వికలాంగులకు, చిన్నారులకు అన్నదానం చేయడం వారికి ఎంతో సంతృప్తిని ఇచ్చింది.అని అన్నారు.ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ:-గిరిజన కుటుంబాలకు అన్నదానం అనేది వారి అవసరాలను తీర్చడానికి సహాయపడే ఒక మంచి కార్యక్రమం అని అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య ధాతగా వ్యవహరించిన కసుకుర్తి కోటేశ్వరరావు భారతి ల దంపతులకు ధన్యవాదాలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో అత్తి మంజరి గోపాలు,పర్వతల రమేష్, పేయ్యల రమణయ్య, చవల సురేంద్ర బాబు, ఈగ వాసు, శివ, కొండూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.