మన న్యూస్, గూడూరు, మే 13:*ఇష్టా రాజ్యాంగా ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్న కబ్జాదారులు. *సివిజి బార్ ఎదురుగా దర్జాగా భూకబ్జా. * ఏ పార్టీ వారైనా భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి.*తాసిల్దార్ ను ఆదేశించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ .గూడూరు అర్బన్, మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిని గుర్తించి ఏ పార్టీ, ఎంతటి వారిని అయినా సహించలేదంటూ అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ తహసీల్దార్ చంద్రశేఖర్ ను ఆదేశించారు. సోమవారం గూడూరు మండల తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దారు, రెవెన్యూ సిబ్బందితో జరిగిన సమీక్ష సమావేశంలో అవినీతి వీఆర్వోలకు ప్రజల ముందే వినూత్నంగా లంచం ఇచ్చి వార్నింగ్ ఇవ్వడంతో ప్రజలు మన ఎమ్మెల్యే శభాష్ అంటూ హర్షిస్తున్నారు. ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే చేయని విధంగా అవినీతి అధికారుల గుండెల్లో జ్వరం కాసేలా స్వరం వినిపించిన గూడూరు ఎమ్మెల్యే కు ప్రజలు జేజేలు కొడుతున్నారు.ఇదిలా ఉంటే గూడూరు రెండో పట్టణ పరిధిలోని ప్రధాన కూడలి అయిన పాత సి వి జి బార్ ఎదురుగా ఉన్న సుమారు 30 లక్షల రూపాయల విలువచేసే 20 అంకణాలకు పై గా ఉన్న ఆర్ అండ్ బి స్థలాన్ని దర్జాగా కొందరు వ్యక్తులు ఆక్రమించుకోవడం చూస్తే ఆక్రమణదారులకు గూడూరు ఎమ్మెల్యే మాటలను కూడా లెక్కచేయకుండా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గూడూరు నియోజకవర్గం, పట్టణాభివృద్ధిని కాంక్షించే ఎమ్మెల్యే ఆదేశాలను సంబంధిత అధికారులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.