మన న్యూస్: పినపాక మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజా భవన్ నందు భారతదేశ తొలి మహిళ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ… ఇందిరాగాంధీ భారతదేశపు మొదటి ఏకైక మహిళ ప్రధానమంత్రి అని ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో నాలుగవ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేశారని, ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె అని, జోహార్ లాల్ నెహ్రూ మొదటిసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన మంత్రికి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేసిన ఒక మహా నాయకురాలని, భారతదేశ ప్రధానిగా దేశ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి దేశాన్ని ముందుకు నడిపిన ఒక మహా నాయకురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారని, ఇందిరాగాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కొన్ని రోజుల్లో ఇందిరా గాంధీ పేరుతో ఇందిరమ్మ ఇళ్ళను పేద ప్రజలకు అందజేసే కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ఎవరైనా పాల్పడితే సహించేది లేదని ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఎవరైనా మోసాలకు పాల్పడితే వారిని ఉపేక్షించేది లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేలినకి నవీన్, పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం, మణుగూరు సింగరేణి ఐ ఎన్ టి యు సి బ్రాంచ్ సెక్రటరీ గట్టయ్య, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.