శ్రీకాళహస్తి, మన న్యూస్:- నీకు సిగ్గెందుకు లేదురా అంటే, అబద్దాల మనిషిని నాకెందుకు సిగ్గు అని వెనకటికొకడు అన్నట్లుగా సిగ్గుమాలిన, అబద్దాల వైసిపి మంద ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పి4 విధానంపై విష ప్రచారం మొదలు పెట్టిందని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం నాయకులు ఆరోపించారు. అబద్ధాలతోనే బతికే వైసిపి వారి అబద్దాలకు ప్రజలు విసిగి పోయి పిశాచుల కోరలు పీకి మూలన కూర్చో బెట్టినా వారికి పుట్టుకతో వచ్చిన బుద్దులు పోవడం లేదని, నైతిక విలువలను, ప్రజాస్వామ్య సూత్రాలను పాతరేసి విద్వేషపూరితంగా పి4 పేదరిక నిర్మూలనా కార్యక్రమం పై కూడా విషం చిమ్ముతున్న వైసిపి ఉగ్రవాదులను, వాళ్లను వెనకుండి నడిపిస్తున్న కుట్రదారులనూ, విషపు రాతలు రాస్తున్న వారిని సమాజానికి దూరంగా తరిమెయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసి లక్షల కోట్లు పోగేసుకొన్న వ్యక్తి పి4 లో ఏదో జరుగుతున్నట్లు గుండెలు బాదుకుంటూ తప్పుడు రాతలు రాయిస్తున్నారని ఆరోపించారు.
జనం కోసం మీడియా కాకుండా, తన కోసం మీడియా ఏర్పాటు చేసుకొన్న జగన్ ప్రజలకు ఉపయోగపడే పథకాలపై విష ప్రచారం చేస్తూ, అధికారంలో ఉన్నప్పుడు పత్రికా ప్రకటనల ద్వారా రూ.450 కోట్లు సాక్షికి దోచిపెట్టిన జగన్ రెడ్డి, ఇప్పుడు దాన్నే తన అసత్యప్రచారానికి వేదిక చేసుకున్నారని ఆరోపించారు.
తన ప్రచారం కోసం తన అనుకూల మీడియాకు ఐదేళ్లలో రూ 858 కోట్లకు పైగా ప్రజాధనాన్ని జగన్ దోచి పెట్టారు. డిజిటల్ కార్పొరేషన్ కు రూ 180 కోట్ల పైన ఖర్చు పెట్టారు. ఐడ్రీమ్ యూట్యూబ్ ఛానల్ ఎండీ వాసుదేవరెడ్డిని డిజిటల్ కార్పొరేషన్ కి ఎండీ గా ఉద్యోగం ఇచ్చి రూ.2.63 కోట్ల వేతనం చెల్లించి, నాటి జగన్ రెడ్డి ప్రభుత్వం ఘరానా దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు.
సాక్షి పత్రిక కొనుగోలు కోసం ఒక్కో వాలంటీర్ కు నెలకు రూ 200 చొప్పున చెల్లించేందుకు జీవో జారీ చేసి మరో రూ.203 కోట్లు దోచారని, అత్యధిక సర్కులేషన్ వున్న ఈనాడుకు రూ243 కోట్ల ప్రకటనలు ఇచ్చి, రెండోస్థానంలో ఉన్న జగన్ మీడియాకు ఏకంగా రూ.371 కోట్ల ప్రకటనలు ఇచ్చి, గత ఐదేళ్లలో ఆంధ్రజ్యోతికి కేవలం రూ.27 లక్షలు విలువ చేసే ప్రకటనలు మాత్రమే ఇవ్వడం జగన్ రెడ్డి చేసిన వివక్షాపూరిత దోపిడీ అని ఆరోపించారు.
*ఐప్యాక్‌కు నిధులు మళ్ళింపుపై విచారణ చేయాలి*
రామ్ ఇన్ఫో అనే సంస్థను ఏర్పాటు చేసి వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐప్యాక్‌కు నిధులు మళ్లించిన నాటి జగన్ ప్రభుత్వ నిర్వాకంపై విచారణ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వలంటీర్ల వ్యవస్థకు వారికి శిక్షణ పేరుతో అస్మదీయులకు భారీగా ప్రయోజనం చేకూర్చింది కూడా జగన్ ప్రభుత్వమే. వాలంటీర్లకు శిక్షణ పేరుతో జగన్ మొత్తం రూ.274 కోట్లు దోపిడీ చేశారు.
రామ్ ఇన్ఫో ఎక్కడా శిక్షణ ఇవ్వలేదని లేదని ఎంతోమంది వలంటీర్లు కూడా చెబుతున్నారు. శిక్షణకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి డేటా కూడా లేదు. కానీ ఏటేటా ఆ కంపెనీకి 68.62 కోట్ల చొప్పున చెల్లింపులు చేశారు.
ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారం చేసే శిక్షణ ఇచ్చింది ఐప్యాక్ సంస్థే అని వలంటీర్లు ఇప్పటికీ చెబుతున్నారు. వలంటీర్లు పూర్తిగా రాజకీయ కోణంలో వైసీపీ, ఐప్యాక్ నియంత్రణలోనే పనిచేసిన విషయం గత ఎన్నికల సమయంలోనే నిరూపితమైందని గుర్తు చేశారు.
ఈ ఉదంతంపై సీఐడీ లేదా ఏసీబీతో విచారణ జరిపిస్తే సొమ్ము అసలు ఎవరికి చేరిందో, ప్రభుత్వ సొమ్ము దోపిడీ చేసింది ఎవరో తేల్చి వాస్తవాలు ప్రజలు ముందుంచి జగన్ రెడ్డి బాగోతాలు బయట పెట్టాలని ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, తిరుపతి పార్లమెంటు నాయకుడు బీమాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.