మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో కోతుల స్వైర విహారంతో ప్రజలు భయాందోళలు చెందుతున్నారు.
కోతులు గుంపులుగా చేరి,ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.నివాసాల్లో చొరబడి తినే తినుబండరాలు సైతం అవి లాక్కునిపోతున్నాయి వస్తువులు ఎత్తుకుపోతున్నాయని పలువురు వాపోతున్నారు.కోతుల నిర్మూలించేందుకు ఏలేశ్వరం నగర్ పంచాయతీ రంగంలోకి దిగారు.350 కోతులను బోన్లో బంధించారు.ఈ సందర్భంగా నగర్ కమిషనర్ ఎం. సత్యనారాయణ మాట్లాడుతూ ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలోని కోతుల బెడద ఎక్కువైంది అన్నారు.సమూహాలుగా వచ్చిన కోతులు నివాస గృహాలలోనికి ప్రవేశించి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడంతోపాటు ఇంట్లో సామాన్లు బీభత్సం చేస్తున్నాయన్నారు. కొన్ని సందర్భాల్లో ఇంటి లో ఉన్న వారి పై దాడికి దిగి అనేక మందిని గాయపరిచాయన్నారు.సమూహాలుగా దాడికి పాల్పడుతున్న కోతులను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను రప్పించి బోలో బంధిస్తున్నామన్నారు. ఎప్పటి వరకు సుమారు 380 కోతులను బోన్ లో బంధించినట్లు చెప్పారు. కాగా వాటిని సురక్షితంగా అడవి ప్రాంతాల్లో వదిలినట్టు అధికారులు తెలిపారు.