మన న్యూస్ సింగరాయకొండ:- గత కొద్ది రోజుల క్రితం సింగరాయకొండకు చెందిన రెండు సంవత్సరముల వయసుగల పాప కిడ్నాప్ కి గురైన సంగతి తెలిసిందే. పాప కిడ్నాప్ గురైన 36 గంటల్లో సింగరాయకొండ పోలీస్ వారు ఎంతో కష్టపడి ఈ కేసును చేదించి పాపను వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఈ క్రమంలో సింగరాయకొండ పోలీస్ వారిని జిల్లా మరియు రాష్ట్రాo నుండి పలువురు అభినందనలు తెలిపారు ఈ సందర్బంగా మంగళవారం సీఐ గారిని మరియు SI బి మహేంద్ర ని సాంత్వన సేవా సంస్థ" బంగారు బాల్యం టీం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ రావినూతల జయకుమార్, డొక్కా కిషోర్, రే ణమాల రాజశేఖర్, పొనుగోటి లాజర్, తాటిపర్తి ప్రణయ్, ఉదయ్ కుమార్ మరియు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.