మన న్యూస్ నర్వ మండలం :- నర్వ మండల పరిధిలోని సిపూరు గ్రామంలో కరెంటు సరిగా రాక కరెంటు కష్టాలలో రైతులు ఇబ్బంది పడుతున్నామని సిపూర్ గ్రామ రైతులు మంగళవారం రోజు కల్వాల్ సబ్ స్టేషన్ లో అధికారులను నిలదీశారు. సోమవారం రోజు కరెంటు పది నిమిషాలు కూడా సరిగా నిలువ లేక, కరెంటు 20 సార్లు పోయి పోయి రావడంతో సిపూరు గ్రామంలో మోటర్లు ఖాళీ, పైపులైన్లు పగిలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సిపూర్ గ్రామంలో యాసంగి వరి పంటలు ముగియడంతో, మరియు ఇప్పుడున్న చెరుకు మునగ తోట్లు దెబ్బతిని రైతులు నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు తెలియజేశారు. నర్వ మండల కేంద్రంలో మొత్తం మూడు సబ్ స్టేషన్లు ఉన్న, మిగతా రెండు సబ్ స్టేషన్ లో కరెంటు యధావిధిగా కొనసాగుతున్న, కల్వల్ సబ్ స్టేషన్ కరెంటు సరిగా సరఫరా అవ్వట్లేదని రైతులు మండిపడ్డారు. కరెంటు ఎందు గురించి సరిగా ఇవ్వట్లేదని లైన్ మాన్ ను, ఆపరేటర్లను రైతులు అడిగితే, కరెంటు లైన్ ల కింద చెట్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని ఊసులు చెప్పుతూ కాలం వెలదీస్తున్నారని రైతులు తెలిపారు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఫోను తీయట్లేదని రైతులను చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. ఇలాగే కరెంటు పోయి పోయి వస్తే చెరుకు మరియు మునగ తోటలు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయే పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు గమనించి రైతులను దృష్టిలో ఉంచుకొని సరైన వేళలో కరెంటు సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపూర్ గ్రామ చెరుకు మరియు మునగ తోట రైతులు పాల్గొన్నారు.