గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి 13-05-2025 :- జోడించడం గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో జిల్లా పెద్దపాడు గ్రామంలోని మహిళా సాధికారత పైన అవగాహన సదస్సు కలుగజేశారు మహిళలు ఇంటికి పరిమితం కాకుండా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని తెలియజేశారు అనంతరం ఎమ్ ఎల్ హెచ్ పి శిరీష మాట్లాడుతూ న్యూట్రిషన్ ఎనీమియా మరియు ఎండ తీవ్రత పైన అవగాహన కల్పించారు ప్రస్తుతం ఎండ ఎక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు బయటికి వెళ్లేటప్పుడు గొడుగు టోపీ లేదా టవల్స్ వంటివి ధరించాలి ఎక్కువగా వాటర్ తీసుకోవాలి ఎండ తీవ్రత నుండి మనల్ని మనమే కాపాడుకోవాలని తెలియజేశారు అనంతరం పంచాయతీ సెక్రెటరీ కృష్ణవేణి మాట్లాడుతూ మహిళలు ప్రతి విషయంలో కూడా అవగాహన కలిగి ఉండాలి విద్యా వైద్య మరియు వ్యాపార రంగాలలో అభివృద్ధి సాధించాలి ముఖ్యంగా గ్రామంలో బాల్యవివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలి వారి వివాహాలను నిర్మూలించాలి ఒకవేళ ఎక్కడైనా జరుగుతున్నట్లయితే సమాచారం తెలియజేయండి 1098 లేదా స్వచ్ఛంద సంస్థలకు తెలియజేసిన మాకు తెలియజేసిన బాల్యవివాహాలు జరగకుండా మేము చూసుకుంటామని తెలియజేశారు గ్రామ అభివృద్ధి కొరకు ప్రతి మహిళ కూడా పాల్గొనాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లైఫ్ చేంజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పరుశరాముడు పంచాయతీ సెక్రెటరీ కృష్ణవేణి ఎం.ఎల్.హెచ్.పి శిరీష ఆశా వర్కర్ బుక్ కీపర్ మహిళలు పాల్గొనడం జరిగింది.