మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ,కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే )ను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను సబ్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్ సర్వేలో భాగంగా కుటుంబ వివరాలను అడిగి నమోదు చేస్తుండగా సబ్ కలెక్టర్ పరిశీలించారు. సర్వేకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్ ను సబ్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎన్యుమరేటర్ కుటుంబ వివరాలు నమోదు చేస్తుండగా సబ్ కలెక్టర్ అక్కడే ఉండి పరిశీలించారు. సర్వే లో అన్ని వివరాలు నమోదు చేయాలని ఎన్యుమరేటర్ కు సబ్ కలెక్టర్ సూచించారు. సర్వే సందర్భంగా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతు న్నాయా అని అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సబ్ కలెక్టర్ వెంట బిచ్కుంద మండల తహసిల్దార్ సురేష్, ఎంపీడీవో గోపాలకృష్ణ, ఎన్యుమరేటర్లు, సర్వే సూపర్వైజర్ తదితరులు పాల్గొన్నారు.