తవణంపల్లి మే 12 మన న్యూస్: మండల కేంద్రంలోని జీసస్ గాస్పెల్ చర్చిలో సోమవారం ఉచిత కంటి వైద్యం శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి జీసస్ గాస్పెల్ ప్రేయర్ మినిస్ట్రీ ట్రస్ట్ చర్చి పాస్టర్ ఏసు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కంటి వైద్య నిపుణులచే కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో కంటిలో సమస్య ఉన్న వారిని గుర్తించి ఆపరేషన్ కు ఎంపిక అయిన 20 మందిని ఉచిత ఆపరేషన్ కోసం చెన్నై ఆసుపత్రి సిబ్బంది సొంత వాహనంలో చెన్నైకి తరలించారు. అనంతరం పాస్టర్ ఏసు మాట్లాడుతూ కంటి ఆపరేషన్ ఎంపికైన వారికి చెన్నై ఆసుపత్రి వారిచే ఉచిత భోజనము,వసతి, నల్ల కంటి అద్దాలు, మందులు, ఉచితంగా ఇవ్వబడునని వృద్ధులు, పేద ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కంటి చూపును మెరుగుపరచుకోవాలని తెలిపారు. వృద్ధులు కంటి పరీక్షలు చేసుకోవడం సంతోషకరమని పాస్టర్ యేసు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కంటి నిపుణులు సిబ్బందులు పాల్గొన్నారు.