మన న్యూస్ ,నెల్లూరు ,మే 12: నెల్లూరునగరంలో ఏడు బాక్స్ టైప్ బ్రిడ్జిలు శాంక్షన్ చేసి 8 సంవత్సరాల గడిచినప్పటికీ కార్యాచరణ కాలేదు...స్థానికంగా ట్రాఫిక్ సమస్యలు నివారించాలంటే...వాటి నిర్మాణం త్వరితగతిన నిర్మించాలని... కలెక్టర్ ,కమిషనర్ కోరారు.రెండవ డివిజన్లో దశాబ్దాలుగా మాలలు బరియల్ గ్రౌండ్ కి వాడుకుంటున్న ప్రభుత్వ స్థలమైన డొంక మూడు ఎకరాల 50 సెంట్లు బరియల్ గ్రౌండ్ అక్రమణలకు గురై వారికి స్మశాన వాటిక కరువైంది..సర్వే చేసి వారికి బరియల్ గ్రౌండ్ స్థలం కేటాయించవలసింది.... కోరారు.16 డివిజన్ గుర్రాలమడుగు సంఘం వెనుక ఉన్న కాలవ కట్టుబడి మరియు రివాల్ట్ వాల్ బ్రేకప్ ఉన్నచోట యాక్సిడెంట్ నివారణ చర్యలు.. తీసుకోవాలని కోరారు.49వ డివిజన్లోని డ్రైనేజ్ సమస్య ఎన్నిసార్లు పరిష్కరించినప్పటికీ కొందరి మున్సిపల్ ట్యాప్ కాలువలో ఉన్నందు వల్ల డ్రైనేజీ నీరు బయటకు వచ్చి స్థానికులకు ఇబ్బందిపడుతున్నారు అని తెలిపారు.రాంనగర్ మా లక్ష్మి అమ్మ గుడి దగ్గర ఉన్న పంట కాలువ పూడిక తీయక దుర్గందం తో వైరల్ ఫీచర్స్ తో స్థానికుల అవస్థలు... పడుతున్నారు అని అన్నారు.జనసేన పార్టీ దృష్టికి కార్పొరేషన్ లిమిట్ లోని వచ్చిన సమస్యల గురించి ఈరోజు కలెక్టర్ ని మరియు కమిషనర్ గాని కలిసి వివరించడం జరిగింది. సానుకూలంగా స్పందించి పరిశీలించి త్వరలో వాటి పరిష్కార మార్గాలను చూపుతామని కలెక్టర్ కమిషనర్ వెల్లడించారు.ముందుగా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించిన అంశాలు.పదవ డివిజన్ రాంనగర్ మహాలక్ష్మి గుడి వద్ద పంట కాలువ క్లీన్ చేయకపోవడం వల్ల దుర్గంధం వెదజల్లుతూ స్థానిక వాసులందరూ వ్యాదుల బారిన పడుతున్నారని వారి సమస్యలు తీర్చాలని స్థానికుల అభ్యర్థన మేరకు పరిశీలించి సంబంధిత అధికారులకు తెలిపిన జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరు సిటీ పర్యవేక్షకులు గునుకుల కిషోర్.16వ డివిజన్ గుర్రాల మడుగు సంగం వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న డ్రైనేజీ పైన గ్రేట్ గ్రిల్ విరిగిపోయి తిరిగేవారికి ఇబ్బందికరంగా ఉంది.గుర్రాలు మడుగు సంగం మంచి మినీ బైపాస్ కి కనెక్టివిటీ ఉన్న రోడ్లో రివాల్టు వార్డు కట్టక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానికుల సమాచారం మేరకు పరిశీలించి సంబంధిత అధికారులకు తెలిపిన జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరు సిటీ పర్యవేక్షకులు గునుకుల కిషోర్.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సిటీ పర్యవేక్షికులు గునుకల కిషోర్,జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,నగర కార్యదర్శి హేమచంద్ర యాదవ్,సిటీ వీర మహిళ శాంభవి, జనసేన నాయకులు యాసిన్,నరహరి,బాలు తదితరులు పాల్గొన్నారు.