ఆదివారం నాడు వెంకటాపురం 5 మదాల దగ్గర నుండి నరవ వరకు మరియు వెంకటాపురం 5 మదాల దగ్గర నుండి కంపర పాలెం ట్రాన్స్ఫార్మర్ వరకు జీవిఎంసి 2 కోట్ల 32 లక్షల రూపాయల నిధులతో బీటీ రోడ్లు నిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి బెహరా భాస్కరరావు గారు బీటీ రోడ్లు పనులను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి బీటీ రోడ్ల పనులలో ఎటువంటి అవకతవకులకు పాల్పడకుండా నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ రోడ్లు నిర్మాణం ఎప్పటినుండో స్థానిక ప్రజలకు కలగా మారింది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన బెహరా భాస్కరరావు గారు జీవీఎంసీ నిధుల నుంచి బీటీ రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు ఈ రోడ్లు నిర్మాణం జరిగితే 5 మదాల నుండి నరవకు మరియు కంపర పాలెం వెళ్లే మార్గం గుండా ప్రజలు రాకపోకలకు సులువుతుందని ఒకప్పుడు వర్షాలు పడితే ఎక్కడికక్కడ బురదలతో గుంటలతో రహదారి పూడికపోయిందని దీనిపై స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు బీటీ రోడ్లు నిర్మాణం జరగడంతో స్థానిక ప్రజలు హర్షం వెల్లడిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గొంతిన నాగరాజు, ఇ. వి. రమణ, మనోహర్, సురేష్, ఊటపల్లి గోవిందు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.