మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 11: నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో మే 15వ తేదీన పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని ఆదివారం మాగుంట లేఔట్ లోని వారి నివాసంలో కలిసి ఈ కార్యక్రమానికి హాజరు కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఎంపీ లాండ్స్ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి తన వంతుగా సహాయ సహకారాలు ఇప్పుడు ఉంటాయని ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు.అనంతరం వారు పలు రాజకీయ అంశాలను చర్చించారు.