తిరుపతి, మన న్యూస్ ప్రతినిధి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలోని పలువురు నేతలకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఆదివారం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల జాబితాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరికీ, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కు అవకాశం దక్కింది. తుడా చైర్మన్ గా 'డాలర్స్ దివాకర్ రెడ్డి : తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా ) చైర్మన్ గా చంద్రగిరి నియోజకవర్గం పెరుమళ్ళపల్లి కి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత పి దివాకర్ రెడ్డి ని నియమించారు. ఈయన చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలుపొందడంలో డాలర్స్ దివాకర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అలాగే తిరుపతి శ్రీకాళహస్తి నియోజకవర్గం అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం దివాకర్ రెడ్డి సేవలను గుర్తించి నామినేటెడ్ పదవుల్లో సముచితస్థానం కల్పించారు. తుడా చైర్మన్ టీటీడీ పాలకమండలి ఎక్స్ ఆఫీషియో వ్యవహరించనున్నారు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్... జనసేన పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో బలోపేతం చేయడంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మొదటినుంచి శక్తివంచన లేకుండా కృషి చేస్తూ వస్తున్నారు. తిరుపతిలో జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఆరని శ్రీనివాసులు గెలుపులో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ వ్యూహాత్మకంగా వ్యవహరించి టిడిపి బిజెపి నేతలను కార్యకర్తలను సమన్వయం చేసుకొని కీలకంగా వ్యవహరించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మొదటినుంచి వీర విధేయుడుగా ఆయన ఆదేశాలతో పాటు పార్టీ విధివిధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళుతూ జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గతంలో ఈయన టీటీడీ బోర్డు సభ్యులుగా కూడా పని చేశారు. జనసేన పార్టీ అధిష్టానం పసుపులేటి హరిప్రసాద్ సేవలను గుర్తించి ఆదివారం ప్రకటించిన నామినేటెడ్ పదవులలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. రాష్ట్ర క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా సుగుణమ్మ... తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మకు ఆంధ్రప్రదేశ్ క్లీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈమె గతంలో రెండు పర్యాయాలు తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈమె భర్త వెంకటరమణ ఎమ్మెల్యేగా ఉంటూ మృతి చెందారు. ఆయన మరణానంతరం ఈమె రాజకీయాల్లోకి వచ్చారు. తిరుపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడంలో కీలకంగా వ్యవహరిస్తూ పార్టీ అధిష్టానం విధి విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లతో పార్టీ నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతున్నారు. తిరుపతిలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలుపులో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో టిడిపి అధిష్టానం ప్రకటించిన రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులలో రాష్ట్ర క్లీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా సుగుణమ్మ నియమితులయ్యారు. అభినందనల వెల్లువ : తిరుపతి జిల్లాకు చెందిన రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులలో ముగ్గురికి అవకాశం రావడంతో కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు వారిని అభినందనలతో ముంచెత్తారు.