మన న్యూస్,తిరుపతిః తాతయ్యగుంట గంగమ్మ జాతరలో అమ్మవారిని ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకి ఈఓ జయకుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అంబిలిని భక్తులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.గంగ తల్లి దీవెనల కోసం భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ భక్తలకు త్వరితిగతిన దర్శనం కల్పిస్తున్నారని ఆయన అభినందించారు. ఈనెల 13వ తేదీన గంగ జాతర సందర్భంగా భక్తులు వేలాది వచ్చే అవకాశం ఉన్నందున ఆ రద్దీకి అనునగుణంగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.