మన న్యూస్ సాలూరు మే 11 := పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఆర్మీ వీర జవాన్ మురళి నాయక్ కు మంత్రి సంధ్యారాణి ఘన నివాళులర్పించారు. దేశ సేవ కోసం అసువులు బాసిన వీర జవాన్ మురళి నాయక్ కు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణుల నడుమ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలర్పించిన మురళి నాయక్ వంటి సిపాయిలను యావద్దేశం గర్విస్తుందన్నారు. మురళి నాయక్ త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. అటువంటి దేశభక్తుడు కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తిరుపతిరావు, మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్, కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ ప్రెసిడెంట్ కూనిశెట్టి భీమారావు, కౌన్సిలర్ హర్షవర్ధన్, బృందావన్ అశోక్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.