మన న్యూస్, నారాయణ పేట:- రబి సీజన్ సందర్భంగా పోరుగు రాష్ట్రం నుండి నారాయణపేట జిల్లాకు వరి ధాన్యం రాకుండా జిల్లా పరిధిలో ఆరు చెక్‌పోస్ట్ లు ఏర్పాటు చేయగా శనివారం సాయంత్రం మక్తల్ సీఐ రామ్‌లాల్ కృష్ణ బ్రిడ్జ్ బోర్డర్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అనంతరం వాహనాలను తనిఖీ చేయగా కర్ణాటక నుండి వస్తున్న వరి ధాన్యంతో కూడిన లారీని తిప్పి పంపడం జరిగిందని తెలిపారు.
చెక్‌పోస్టు దగ్గర ఉన్న పోలీస్, రెవెన్యూ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక నుండి వారి ధాన్యంతో ఉన్న వాహనాలను నారాయణపేట జిల్లాలోకి అనుమతించరాదని సూచించారు. చెక్ పోస్ట్ ల వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. వాహనాలకు సంబంధించిన ప్రతి వాహన నంబర్లను రిజిస్టర్లు నమోదు చేయాలని తెలిపారు. ధాన్యంతో వాహనాలు వస్తే రిటర్న్ పంపించాలి లేదా రెవెన్యూ అధికారులకు అప్పగించాలని తెలిపారు.