కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 11: కడప జిల్లా బద్వేల్ రెవిన్యూ డివిజన్ పరిధి లో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)లకు ప్రభుత్వం వీఆర్ఏల విద్యార్హతలు మేరకు సీనియార్టీ ప్రకారం లిస్టు తయారుచేసి అటెండర్. వాచ్ మెన్ పోస్టులు నియామకాలు చేయాలని ఏపీ వీఆర్ఏ వెల్ఫేర్ అండ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్మది ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని కోరారు. బద్వేల్ పట్టణం లోని ఎన్జీవో హోం నందు రాష్ట్ర కార్యదర్శి గుర్రాల హరికృష్ణ అధ్యక్షతన ఏర్పాటుచేసిన వీఆర్ఏ లు సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా వీఆర్ఏల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తిష్ట వేసి ఉన్నాయని ఉద్యోగుల అభీష్టం మేరకు ఏర్పడిన కూటమి ప్రభుత్వం వీఆర్ఏలకు తక్షణమే ప్రమోషన్లు కల్పించి, ఊరట కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం యొక్క స్పందన కొరకు వీఆర్ఏలు ఎదురుచూస్తున్నారని, బద్వేలు రెవిన్యూ డివిజన్ కేంద్రం నూతనంగా ఏర్పడడంతో పాటు డివిజన్ లోని అన్ని తాహాశీల్దార్ కార్యాలయాలలో ఖాళీగా ఉన్న అటెండర్ వాచ్ మెన్ పోస్టుల నందు వీఆర్ఏలను నియమించాలని, ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం త్వరలో అధికారులను స్వయంగా కలిసి వినతి పత్రాలు ఇవ్వాలని ఈ బృహత్తరమైన కార్యక్రమం నకు వీఆర్ఏ లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.