మన న్యూస్ సాలూరు మే10:= ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ నిధి నుండి వచ్చిన మూడు చెక్కులను మంత్రి సంధ్యారాణి పంపిణీ చేశారు. పట్టణంలో ని కోటవీధికి చెందిన తాలాడ సుభద్రమ్మకు 65,931, రూపాయలు,19 వార్డులోని ఉన్న రాపాక సూర్య కుమారికి 35,569, రూపాయలు, సాలూరు మండలం మామిడి గ్రామానికి చెందిన ఏలి నిహారుకు 1,03,404 రూపాయల సీఎం సహాయనిది చెక్కులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శనివారం తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుందన్నారు. కష్టకాలంలో ఆర్థికంగా ఆదుకున్న మంత్రి సంధ్యారాణితో పాటు ముఖ్యమంత్రి కి అల్లాడిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతరావు, మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్, 19 వ వార్డు కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్, బృందావనం అశోక్ ,యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.