మన న్యూస్, నారాయణ పేట:- శనివారం రోజు నర్వ మండల కేంద్రంలోని నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో పలు ప్రదేశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. గంజాయి మత్తు పదార్థాల నిర్మూలన గురించి, అక్రమ రవాణా జరగకుండ నర్వ మండల కేంద్రంలో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా కిరాణా షాపులలో, అనుమానంగా ఉన్న పంట పొలాల్లో, పన్ షాప్ లలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజలు, ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తున్న లేదా రవాణా చేసిన, సరఫరా చేసిన వెంటనే డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుతది అని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీ సీ సురేష్ బాబు, నార్కోటిక్స్ స్నైపర్ డాగ్ విక్కి, డాగ్ హ్యాండ్లర్ పరమేశ్ పాల్గొన్నారు.