మన న్యూస్, 250 కోట్ల రూపాయలతో నిజాంసాగర్ ప్రధాన కాలువ, ఉపకాల్వల బాగుకు వెచ్చించమంటూ సాగునీటి పారుదల శాఖ అధికారులు గొప్పగా చెప్పుకుంటున్న అధికారులు క్షేత్రస్థాయిలో నిజం సాగర్ కాల్వల దుస్థితి ఒక్కసారి చూస్తే మీరు చేసిన అభివృద్ధి ఏందో తెలిసిపోతుంది.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రదాయని నిజాంసాగర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును మంజీరా నదిపై నిజం సాగర్ వద్ద 1930లో నవా ప్రభుత్వం నిర్మించింది. అప్పటినుంచి 2008 వరకు ఈ నిజాంసాగర్ కాలువలపై ప్రభుత్వాలు మారిన, పాలకులు మారిన ఎవరు పట్టించుకోకపోవడంతో, 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నిజాంసాగర్ ప్రధాన కాలువ, ఉపకాల్వలకు పూర్వ వైభవం తీసుకురావడానికి 542 కోట్లు మంజూరు చేశారు. దీనితో నిజం సాగర్ ప్రధాన కాలువ, ఒకటి నుంచి 82 వరకు గల ఉపకాల్వలు బాగు చేశారు. ఆ తర్వాత 2017లో కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ కింద నిజాంసాగర్ ప్రధాన కాలువ, ఉపకాల్వాలు బాగు కోసం 262 కోట్ల రూపాయలు కేటాయించింది. వీటితో నిజం సాగర్, బాన్సువాడ, బోధన్ ప్రాంతంలో ప్రధాన కాల్వతో పాటు, ఉపకాల్వలు 2022 వరకు బాగు చేశామని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ 250 కోట్ల రూపాయలతో పనులు ఎక్కడ కూడా సక్రమంగా చేయకుండా భారీ ఎత్తున నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక బాన్స్వాడ నియోజకవర్గంలోని 87 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు నీటిపారుదల శాఖ అధికారుల రికార్డులు చూపుతున్నాయి. క్షేత్రస్థాయిలో నిజాంసాగర్ ప్రధాన కాలువ మొదలుకొని, ఒకటి నుంచి 28 ఉపకాల్వల వరకు పూడికచేరి, తూములు, కాల్వ గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మన దినపత్రిక రాష్ట్ర ప్రతినిధి డి 28 ఉపకాల్వ దుస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది. ఈ ప్రధాన కాల్వ కింద కోటగిరి,, రుద్రూర్, బోధన్, సాలూర ప్రాంతాలకు సుమారుగా 50వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ కాలువ దుస్థితి అద్వానంగా మారింది. పూర్తిగా కాల్వలో పూడిక చేరిపోయింది, దీంతోపాటు తూములు శిథిలావస్థకు చేరుకున్నాయి, కాల్వ గోడలు పగుళ్ల బారిన పడ్డాయి. 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే డి 28 ఉపకల్వ దుస్థితి ఇలా ఉంటే, మరి ఉపకల్వల దుస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించే అవసరం లేదు. ఉప కాల్వలని పూడికచేరి, శిథిలావస్థకు చేరుకొని చివరాయకట్టుకు నీరు అందించడం గగనమైంది. నాబార్డు నుంచి మంజూరైన 250 కోట్ల రూపాయలతో 2022 వరకు పనులు పూర్తి చేశాము అని చెప్పుకొని వస్తున్న సాగునీటి పార్లర్ శాఖ అధికారులు పనులు ఎక్కడ చేశారో, పత్రిక ముఖంగా వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.