మన న్యూస్ ఐరాల మే 9:- కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దర్శనార్ధం కాణిపాకం ఆలయంకు విచ్చేసిన రాజమండ్రి సిటీ నియోజకవర్గ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ని మరియు ఆయన సతీమణి మాజీ శాసనసభ్యులు ఆదిరెడ్డి భవాని ని కాణిపాకం ఆలయ వెలుపల పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలువతో సత్కరించారు. అనంతరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వారు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్, ఐరాల మండల అధ్యక్షులు గిరిధర్ బాబు, మాజీ ఆలయ ఛైర్మన్ మణినాయుడు, మాజీ జెడ్పీటీసీ వెంకటేష్ చౌదరి, చిత్తూరు పార్లమెంటు రైతు సంఘం ఉపాధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు,కాణిపాకం మాజీ సర్పంచ్ మధుసూదన్ రావు మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.