* రుతుస్రావం ఇతర విషయాలపై అవగాహన కల్పించిన అంగనవాడి కార్యకర్తల బృందం...
* గర్భిణీ స్త్రీలకు భోజనాలు ఏర్పాటు చేసిన దాత బత్తిన తాతాజీ...
శంఖవరం మన న్యూస్ (అపురూప్) : గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటేనే తల్లి బిడ్డ క్షేమమని స్థానిక ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఎస్ఎస్ రాజీవ్ కుమార్ సూచించారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల ఆరోగ్య అధికారి డా.ఆర్
వి.వి.సత్యనారాయణ ఆధ్వర్యం గర్భిణీ స్త్రీలకు ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వైద్యులు డా. శెట్టిబత్తుల శ్రీ రామ్ రాజీవ్ కుమార్ వచ్చిన గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేసి, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆహార అలవాట్లు పై అవగాహన కల్పించారు. వచ్చిన 18 మంది గర్భిణీ స్త్రీలులో 05 మందిలో ప్రమాద శాతాన్ని గా గుర్తించారు..
అనంతరం ఆయన మాట్లాడుతూ, వాసవికాలంలో గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలు పాటించాలని, సకాలంలో మందులు తీసుకోవాలని రోజు కొంత సమయం వ్యాయామం చేయాలని మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని అవగాహన కల్పించారు. అనంతరం
కిషోర బాలిక వికాసం లో భాగంగా శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ టిడిఆర్ పద్మావతి ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణ అధికారి పిఓ జాగారపు విజయ ఆదేశాల మేరకు అంగన్వాడీ కార్యకర్త గెడ్డం బుల్లెమ్మ తదితర అంగన్వాడి కార్యకర్తలు, చిన్న వయసులో గర్భం దాల్చడం పై, రుతుస్రావం సమయంలో పరిశుభ్రత పాటించడ పై అలానే వచ్చిన గర్భిణీ స్త్రీలకు పౌష్ఠిక ఆహారం అలవాట్లు పై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమనికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు, ఆస్పత్రి సిబ్బందికి స్టార్ లైట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజన దత్తగా బత్తిన తాతాజీ పుట్టినరోజు సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ లైట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గునపర్తి అపురూప్, దలిత నాయకులు కానేటి వెంకట రమణ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సిహెచ్ఓ మరీ మణి, పీహెచ్ఎన్ కృష్ణకుమారి, హెచ్ వి వెంకటలక్ష్మీ, ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలు, ఆగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.