ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || May 9, 2025, 10:30 pm
సంక్షేమ పథకాన్ని అమ్ముకున్న నాయకునికి రాజకీయ భవిష్యత్తు ఉండదు..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) సంక్షేమ పథకాన్ని అమ్ముకున్న నాయకునికి రాజకీయ భవిష్యత్తు ఉండదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ సొసైటీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పుతో అధికారంలోకి రావడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను అమలు చేసే విధంగా కృషి చేస్తున్నామన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు.సన్న వరికి 500 బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజలలోకి తీసుకువెళ్లాలని అన్నారు.మొహమ్మద్ నగర్ మండలం ఏర్పడిన తర్వాత 1 కోటి 60 లక్షలతో సీసీ రోడ్లు వేయడం జరిగిందన్నారు. ఇంకా అభివృద్ధి కావాలంటే నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. మండల కార్యాలయానికి త్వరలో నిర్మించడానికి కృషి చేస్తానన్నారు. ఉమ్మనూరు మండలానికి నూతనంగా 30 వేల టన్నుల గోదాం మంజూరైనట్లు తెలిపారు.మొహ్మద్ నగర్ మండలంలోనే ఇండస్ట్రీట్ టౌన్షిప్ ను ఏర్పాటు చేయాలని దిశగా ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. మొహమ్మద్ నగర్ మండలానికి 250 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లులల్లో ఇలాంటి అవకతవకాలు లేకుండా పూర్తి చేయవలసిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వార్ధాన్ని వీడి గ్రామంలో నిరుపేదలు అయిన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా సహకరించాలని సూచించారు.ఇందిరమ్మ ఇళ్లలో ఏ అధికారికి కూడా లంచం ఇచ్చినట్లు తెలిస్తే కార్యకర్త అధికారిపై వేటు వేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రపంచంలోనే లేనటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క నిరుపేదలకు అందే విధంగా చూడవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,యువజన మండల అధ్యక్షులు మల్లయ్య గారి ఆకాష్,ఎస్టిసెల్ ఉపాధ్యక్షులు లోక్య నాయక్,తహసీల్దార్ సవాయి సింగ్, సీనియర్ నాయకులు నాగభూషణం గౌడ్,ఖాలీక్,సవాయి సింగ్,సంతోష్,తదితరులు ఉన్నారు.
https://www.mananews.co.in