చిత్తూరు నవంబర్ 18 మన న్యూస్
చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,ఐరాల మండల పరిధిలోని కాణిపాక పరిసరాల్లో ఉన్న ఖాలీ భూమిలో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుపై అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని స్థానిక దళిత నాయకులు గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించిన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారు వెంటనే సాంఘిక సంక్షేమ జాయింట్ డైరెక్టర్ గారిని పిలిచి భవన నిర్మాణానికి స్తల పరిశీలన చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదే విషయంపై పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ.డా.మురళీమోహన్ గారికి,మండల MRO గారిని త్వరలో కలిసి విన్నవించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక దళిత నాయకులు నటరాజ్, బొమ్మసముద్రం సర్పంచ్ రఘు,అవార్డు రవి,జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో, దళిత ప్రజా వేదిక ధనంజయ,మాజీ సర్పంచ్ రామ చంద్రయ్య,కుమార్,నగేష్,రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.