మన న్యూస్, గూడూరు, మే 9:- తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో మే 9 తేదిన శుక్రవారం కృప సేవా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య ధాతగా వ్యవహరించిన షేక్ బాషా,షేక్ బషీరా దంపతుల కూతురు కీ కవల పిల్లలు(మనవరాలు,మానవడ్లు ) పుట్టడంతో శుభ సందర్భంలో పదిమందికి వృద్ధులకు అన్నదానం చేయాలని మంచి ఆలోచనతో ఈ అన్నదానం ఈ కార్యక్రమం నిర్వహించారు.కృప సేవ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ……. ఈరోజు దాతగా వ్యవహరించిన షేక్ బాషా,షేక్ బషీరా దంపతుల కూతురు బిడ్డకు ఇద్దరు కవల పిల్లలు కు జన్మ ఇవ్వడంతో వారి కోరిక మేరకు ఈరోజు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఇదే కాకుండా షేక్ బాషా,షేక్ బషీరా దంపతుల కుటుంబ సభ్యులు గత కొన్ని నెలలుగా మా కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారని ఇంకా ముందు ముందు కూడా ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అత్తి మంజరి గోపాలు, పేయ్యల రమణయ్య, చవల సురేంద్ర బాబు, తోట రవి చంద్ర తదితరులు పాల్గొన్నారు.