
మన న్యూస్ ,కోవూరు ,మే 9: - విడవలూరులో వైసిపి భూస్థాపితం అయిపొయింది. చంద్రబాబు నాయుడు విధానాల పట్ల ఆకర్షితులై టిడిపికి జై కొడుతున్నారు. విభేదాలు పక్కన పెట్టి గ్రామాభివృద్ధి కోసం పాటు పడండి. వైసిపి నేతలకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.
నెల్లూరు జిల్లా ,విడవలూరు మండలంలో వైసిపి ఖాళీ అయింది. వైసిపి జిల్లా రైతు సంఘ అధ్యక్షులు పూండ్ల అచ్యుత్ రెడ్డి ఆ పార్టీ వీడి శుక్రవారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. విడవలూరు, రామతీర్ధం, గాజులదిన్నె, రామచంద్రాపురం, రామతీర్ధం, వావిళ్ళ, దండిగుంట, దంపూరు తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా దంపూరు సర్పంచ్ ఇనగంటి సురేందర్ రెడ్డి, దండిగుంట సర్పంచ్ బెల్లంకొండ సుప్రజ, విడవలూరు సర్పంచ్ యాటగిరి ప్రవీణ్, మాజీ ఎంపీటీసీ కొమ్మిరెడ్డి మురళి రెడ్డి, చౌకిచర్ల మాజీ సర్పంచ్ అళగిరి వినోద్, సహకార సంఘం మాజీ అధ్యక్షులు ఏనేటి ప్రసాద్, రామతీర్ధం ఆలయ మాజీ ఛైర్మెన్ నాటారు చంద్రయ్య, అలగానిపాడు ఎంపిటిసి చింతాడి జగన్మోహన్, మాజీ ఉప సర్సంచ్ పొన్నం సుధాకర్, మాజీ ఉప సర్సంచ్ వెంకటరమణ, వీరారెడ్డి పల్లి ఉప సర్సంచ్, గౌడ సంఘం అధ్యక్షులు కోసూరు రవిలతో పాటు విడవలూరు మండల వైసిపి సీనియర్ నాయకులు నిమ్మల రవీంద్ర, మౌలాలి, పొన్నపూడి తాతారావు, కాటం శీనయ్య, ఆవుల సుధీర్, కంది మునిస్వామి, కంది వేణు చేబ్రోలు జనార్దన్ తదితర నాయకులను పేరు పేరునా స్వాగతం పలుకుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పసుపు కండువాలు కప్పి టిడిపిలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ …ఇది వ్యక్తులకు సంబంధించిన మార్పు కాదని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మాత్రమే ఈ రాష్టం బాగు పడుతుందన్న ప్రజలలో వస్తున్న మార్పుకు సంకేతమన్నారు. తెలుగుదేశం పార్టీ పేదల ఆకాంక్షలను, యువత ఆశలను, మహిళల సాధికారతను, రైతుల సంక్షేమాన్ని కాపాడే పార్టీగా ఆమె అభివర్ణించారు. విభేదాలకు తావు లేకుండా అభివృధ్ధి అన్న ఏకైక లక్ష్యంతో పనిచేసి పెట్టి గ్రామాభివృధ్ధికి పాటు పడాలని కోరారు. ఈ సందర్భంగా అభివృద్ధే టిడిపి నినాదం, సంక్షేమమే చంద్రబాబు నాయుడు విధానమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి .వేమిరెడ్డి దంపతుల అభివృద్ధి మరియు సేవాకార్యక్రమాలకు ఆకర్షితులమై టిడిపిలో చేరాం అని అన్నారు. అనంతరం వైసిపి నాయకులు పూండ్ల అచ్యుత్ రెడ్డి మాట్లాడుతూ….. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేస్తున్న అభివృద్ధి, పార్టీలకతీతంగా చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి ఆకర్షితులమై టిడిపిలో చేరుతున్నట్టు ప్రటించారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నాయకత్వంలో కోవూరు నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన మాట మీద నమ్మకంతో వైసిపి వీడి టిడిపిలోకి వచ్చిన తన అనుచరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
