పూతలపట్టు నవంబర్ 18 మన న్యూస్
పూతలపట్టు మండలం కొండ కింద పల్లి కి చెందిన బి. మనోహర్ నాయుడు ( 48) రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందాడు..పూర్తి వివరాలు మనోహర్ నాయుడు సోమవారం మధ్యాహ్నం స్వగ్రామం నుండి స్కూటర్లో పాకాలకువెళుతుండగా--అయ్యప్ప గారి పల్లి వద్ద పాకాల నుండి పాటూరుకి వస్తున్న ఆటో అతివేగంగా వచ్చిమనోహర్ నాయుడు స్కూటర్ని ఢీకొనడంతో మనోహర్ నాయుడు రహదారి పక్కనున్న ఫెన్సింగ్ కమ్ములపై పడడంతో తలకు కాళ్లకు బలమైన గాయాలడంతో మనోహర్ నాయుడు అక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు పూతలపట్టు సీఐ కృష్ణమోహన్ దర్యాప్తు చేస్తున్నారు