మన న్యూస్ ,నెల్లూరు, మే 8: నెల్లూరు కోటమిట్ట 42 వ డివిజన్ ARB ఫంక్షన్ హాల్లో ఖత్నా (ఒడుగులు) కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వైఎస్ఆర్సిపి జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో 200 మంది చిన్నారులకు ఉచిత ఖత్నా..నిర్వహించడడం జరిగింది.ఈ సందర్బంగా ఖత్నా చేయించుకున్న చిన్నారులకు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నిత్యవసర వస్తువులు,పౌష్టికాహారం, అందజేశారు.ఈ సందర్బంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.......వైఎస్ఆర్సిపి జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో పేద ముస్లిం పిల్లలకు ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు.పేద ప్రజలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో పూర్తి స్ఫూర్తిదాయకమన్నారు తెలిపారు. ఈ కార్యక్రమంలో 42 వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా, వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్,మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుస్సేని,వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయ కృష్ణారెడ్డి, ముస్లిం సంచార జాతుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు బాబా బాయ్, 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమా మహేష్, వైసిపి సీనియర్ నాయకులు మలి రెడ్డి కోటారెడ్డి, 42 డివిజన్ అధ్యక్షులు అబ్దుల్ మస్తాన్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మున్వర్, జిల్లా యాక్టివిటీ కార్యదర్శి జహీద్,11 వ డివిజన్ ఇన్ చార్జ్ మహేష్ యాదవ్, వైసిపి నాయకులు అలీమ్, యస్థాని,ఖాదర్, పెంచలయ్య, వాణి, రమిజా తదితరులు పాల్గొన్నారు.