'మన న్యూస్, తిరుపతి:సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీకి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గురువారం నాటి ఉదయం న్యూఢిల్లీ నుంచి తిరుపతి చేరుకున్న ఎంఏ బేబీకి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వి నాగరాజు, నేతలు కందారపు మురళి, టి. సుబ్రహ్మణ్యం, కేఎన్ఎన్ ప్రసాదరావు, హరినాథ్, ఈశ్వరి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.