మన న్యూస్, తిరుపతి:- రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం సాయంత్రం రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రత్యేకంగా పుష్పగుచ్ఛం అందజేసి మంత్రి లోకేష్‌ను ఆహ్వానించారు. అలాగే ఇతర ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై మంత్రి రాక సందర్భంగా హర్షాతిరేకాలతో స్వాగతం తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ అక్కడ అధికారులను కలిసి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సత్యవేడు ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు. సత్యవేడు పరిధిలో విద్యా, ఐటీ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి స్వయంగా పరిశీలించనున్నారు. అదేవిధంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.