మన న్యూస్ సాలూరు :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మే 07 ఈ నెల 18,19,20 తేది లో జరగబోయే శ్రీ శ్రీ శ్రీ శ్యామలంబ అమ్మవారి పండుగ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి ఆర్ . పి. ధర్మ చంద్ర రెడ్డి శ్యామలంబ అమ్మవారి ని దర్శించుకుని ఆలయం ప్రాంగణం నీ పరిశీలించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ వెనక భాగం గ్రౌండ్లో మంచినీరు, మజ్జిగను సరఫరా చేయమని ఎండోమెంట్ వారికి ఆదేశించారు. ఆలయ చుట్టూ జరుగుతున్న ఫ్లోరింగ్ వర్క్ ను పరిసరాలను పరిశీలించి అనంతరం అల్లు వీధి లో ఉన్న అమ్మవారి సినిమాను రధాన్ని పరిశీలించి రధమ్మాను తిరిగే రూట్ మ్యాప్ ను పరిశీలించారు. పండుగ సందర్భంగా వాహన పార్కింగ్ స్థలాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి.టీ.వి. కృష్ణారావు, పట్టణ తాసిల్దార్ ఎన్.వి . రమణ, డి.ఈ.ప్రసాద్ రావు, సానిటరీ ఇన్స్పెక్టర్ ఎల్.బాలకృష్ణ , డి ఆర్. శివకుమార్ , ఎం పీ డీవో పార్వతి, మరియు ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.