మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే 7:- 339 అభివృద్ధి పనులను 60 రోజుల్లో పూర్తి చేసిన ఘనత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే దక్కుతుంది. *నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యే కావడం గొప్ప విషయం .నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని గాంధీనగర్ నుండి డైకాస్ రోడ్డు వరకు 2 కోట్ల 67 లక్షలతో రోడ్డు సెంట్రల్ లైటింగ్ మరియు డివైడర్ పనులకు బుధవారం సాయంత్రం శంకుస్థాపన చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి,రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు ఆనం రంగ మయూర్ రెడ్డి.నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యే కావడం గొప్ప విషయం అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.అభివృద్ధి పనులకు నిధులు తేవడంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దిట్ట అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
339 అభివృద్ధి పనులను కేవలం 60 రోజుల్లో పూర్తి చేయడమంటే చిన్న విషయం కాదు ఆ ఘనత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే దక్కుతుంది అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
నెల్లూరు జిల్లా అభివృద్ధికి నిరంతరం శ్రమించే వ్యక్తి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.