మన న్యూస్ సింగరాయకొండ:-సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ వసతి గృహాలకు వార్డెన్ గా పనిచేసి ఎ. ఎస్. డబ్ల్యూ.ఓ రిటైర్డ్ అయిన మేడికొండ లక్ష్మీనరుసు నాలుగవ వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీ విద్యార్థి ఫౌండేషన్ చైర్మన్ గుడిమెట్ల శ్రీనివాసులు, ఆధ్వర్యంలో పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని బాలిరెడ్డి నగర్ అంగన్వాడి కేంద్రం నందు చిన్నారులకు మరియు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. గుడిమెట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ఎంతోమంది పేద విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన తమ గురువుకి ఈ విధంగా నివాళి అర్పించడం ఆనందంగా ఉన్నదని,పేద విద్యార్థులకు విద్యాపరమైన ప్రోత్సాహం అందించుటకు తమ వంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమతో పాటుగా సింగరాయకొండ ప్రభుత్వ హాస్టల్లో వసతి పొంది ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన ఎందరో విద్యార్థులు నేడు దేశంలోని నలుమూలల వివిధ ప్రభుత్వ శాఖలలో, ప్రైవేట్ రంగంలో ఉన్నత స్థానం పొందిఉన్నారన్నారు. అదేవిధంగా చిన్నతనం నుండే సర్దుబాటుతనం,విద్యలో పోటీతత్వం,నాయకత్వ లక్షణాలు, తమ తోటి వారితో మసులుకొనే విధానం,తమ హక్కులను సాధించుటకు పోరాడే తత్వం,వ్యవస్థలోని కట్టుబాటులకు లోబడి జీవించే విధానం లాంటి లక్షణాలను అలవాటు చేసుకోవటంతో పాటుగా ఎంతోమంది స్నేహితులను అందించిన సాంఘిక సంక్షేమ హాస్టళ్ల లోని జీవన విధానం తమకు ఉన్నతమైనదన్నారు.తమ గురువు లక్ష్మీనరసుకి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ షేక్ రిజ్వానా, ప్రభుత్వ హాస్టల్ పూర్వ విద్యార్థులు బొందు ప్రసాద్,పులి అంకయ్య మరియు అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.