మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎల్లమ్మ జాతరను పురస్కరించుకుని నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో రసవత్తరంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.ఈ కుస్తీ పోటీలు ఉదయం కొబ్బరికాయ కుస్తీ పోటీ నుంచి 100,500,1000,2000 వరకు కుస్తీ పోటీలు కొనసాగించారు.కుస్తీ పోటీలను తిలకించే అందుకోసం మహారాష్ట్ర, కర్ణాటక,బీదర్,జహీరాబాద్, నారాయణ ఖేడ్, తదితర ప్రాంతాల నుంచి మరలయోధులు అధిక సంఖ్యలో పాల్గొని కుస్తీ పట్టారు.కుస్తీ పోటీలో గెలుపొందిన మరలయోధులకు బంగ్లా ప్రవీణ్ కుమార్,పిట్ల సత్యనారాయణ, బాలరాం,చాకలి రమేష్ కుమార్ లు కలిసి నగదును అందజేశారు.ప్రతి సంవత్సరం ఎల్లమ్మ జాతర ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. చివరికి కుస్తీ పోటీ గోధుమగావు గ్రామానికి చెందిన మరలయోధులు గెలుపొందడంతో 2500 రూపాయల నగదును అందజేశారు.ప్రతి సంవత్సరం ఎల్లమ్మ ఉత్సవాలను గ్రామస్థులు అందరూ కలిసి సహాయ సహకారాలు అందించి విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.