మన న్యూస్, నెల్లూరు ,మే 6:- నెల్లూరు సంతపేట 49 వ డివిజన్ ఈద్గా మిట్ట మసీదు వద్ద ఉచిత ఖత్నా (ఒడుగులు) కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. సహారా ట్రస్ట్ నిర్వాహకులు మౌలానా ముస్తాక్ అహ్మద్ అహని, 49 వ డివిజన్ వైసీపీ నాయకులు షఫీ ఆధ్వర్యంలో డాక్టర్ మహమ్మద్ చేత 50 మంది చిన్నారులకు ఉచిత ఖత్నా .. చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఖత్నా చేయించుకున్న చిన్నారులకు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పౌష్టికాహారం బట్టలు అందజేశారు. పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…….వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారంతో పేద పిల్లలకు సామూహిక ఖత్నా కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరమైన తెలిపారు.
పేద ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మును ముందు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్,మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుస్సేని, రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి సమీర్ ఖాన్,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ సిద్దిక్, వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయ కృష్ణారెడ్డి,42 వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా, 42 డివిజన్ నాయకులు అబ్దుల్ మస్తాన్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మున్వర్, జిల్లా యాక్టివిటీ కార్యదర్శి జహీద్, వైసిపి నాయకులు యస్థాని,ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.