శంఖవరం మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం జి. కొత్తపల్లి గ్రామంలో మాస్టర్ ట్రైనర్(యమ్ టి)దాడి వరలక్ష్మి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమ ప్రణాళిక ఖరీఫ్ 2025 లో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తపల్లి గ్రామ సర్పంచ్ ఈగల రవికుమార్, అప్పారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఈగల రవికుమార్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వలన ఎంతో మేలు కలుగుతుందని రసాయన వ్యవసాయం చేసే రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని కోరారు. రసాయనిక వ్యవసాయం వలన కౌలు రైతుకు పెట్టిన పెట్టుబడి తప్ప మిగులు ఏమీ ఉండదని, నష్టం వాటిల్లుతుందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తే పెట్టుబడి తక్కువ అవుతుందని తద్వారా లాభం కలుగుతుందని వివరించారు.యమ్ టి వరలక్ష్మి మాట్లాడుతూ ప్రతి రసాయన వ్యవసాయం చేసే రైతు తన రసాయన పద్ధతులు మాని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ పెట్టుబడి తగ్గించుకొని లాభసాటి వ్యవసాయం చేసేందుకు అవగాహన కల్పించారు. కేఏపీ 2025 - 26 ప్రణాళికలో భాగంగా శంఖవరం, రౌతులపూడి మండలాలు కేఏపీ చేయడం జరిగిందని, గతం లో సంఘ సభ్యురాలు తో మాత్రమే కేఏపి చేసేవాళ్ళమని, అందువలన డేటా పూర్తిస్థాయిలో వచ్చేది కాదని, ఇప్పుడు సంఘ సభ్యురాలు భార్యాభర్త లను కూర్చోబెట్టి రాయడం వలన డేటా పూర్తిస్థాయిలో వస్తుందని అన్నారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎలియాజర్ ఆదేశాల మేరకు ప్రతీ మండలం లో మొత్తం డేటాను ముందుగానే సిద్ధం చేసుకోమని చెప్పడం వల్ల కేఏపి సులువుగా చేయడం జరుగుతోందన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్న ఆదర్శ రైతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విఎఎ లు క్రాంతి, బిందు, ఐ సి ఆర్ పి లు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.