మన న్యూస్ సింగరాయకొండ :- ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎస్ఎస్సి(SSC) ఫలితాలలో అత్యధిక మార్కులతో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన టంగుటూరు మండలం ఆలకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పుట్టా సాయి వెంకట భార్గవి 595/600 మార్కులు ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరిట గౌరవించుకుంటున్నామని, వేసవి సెలవులకు ముందే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, విద్యార్థి కిట్లు,తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేసి నారా లోకేష్ గారి సారధ్యంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం 10,116 రూపాయల నగదు బహుమతిని మంత్రి గారి చేతుల మీదుగా విద్యార్థిని భార్గవికి అందజేశారు. కార్యక్రమంలో తెలుగు నాటి జిల్లా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్,ఉపాధ్యక్షులు చెరుకూరి పూర్ణచంద్రరావు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు అర్రిబోయిన రాంబాబు, కార్యదర్శి యనమల ఆంజనేయులు ప్రధానోపాధ్యాయులు వాకా వెంకటేశ్వర్ రెడ్డి ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.