రౌతులపూడి మన న్యూస్ (అపురూప్) యుక్త వయస్సులో రుతుక్రమం, పరిశుభ్రత, నిర్వహణ, ఇతర ఆరోగ్య, ఆహారపు అలవాట్లుపై కిశోర బాలికలకు అవగాహన కలిగి ఉండాలని కాకినాడ జిల్లా బాలల విభాగం అధికారి ప్రొటెక్షన్ ఆఫీసర్ జాగారపు విజయ సూచించారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన రౌతులపూడి సచివాలయ -1,2 పరిధిలో శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి టి డి ఆర్ పద్మావతి ఆధ్వర్యంలో కిషోరీ వికాసం సమ్మర్ క్యాంపెయిన్ లో భాగంగా కౌమార బాలికలకు బాల్య వివాహాల పైన మరియు రుతు క్రమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణ అధికారి ( ప్రొటెక్షన్ ఆఫీసర్) జాగరపు విజయ హాజరై ఆమె మాట్లాడుతూ, ప్రతి మహిళ తన ఆరోగ్య సంరక్షణ కోసం అవగాహన పెంచుకోవడంతో పాటు హక్కుగా భావించాలని, కౌమార బాలికలకు రుతుక్రమ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల మరియు, ఆహారపు అలవాట్ల పై అవగాహన కలిగి ఉండాలని, రుతుక్రమ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.రుతుక్రమ సమయంలో పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం అని పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం ద్వారా, బాలికలు అంటువ్యాధులు మరియు ఇతర ఆరోగ్య సమస్యల నుండి తమను తాము కాపాడుకోవచ్చని అన్నారు.రుతుక్రమం గురించి అవగాహన కలిగి ఉండటం ద్వారా, బాలికలు ఆత్మవిశ్వాసంతో మరియు ఆత్మగౌరవంతో ఉంటారని అన్నారు. రుతుక్రమ సమయంలో బాలికలు పాఠశాలకు వెళ్లడం మరియు ఇతర సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం చాలా కష్టంగా ఉంటుందని, రుతుక్రమం గురించి అవగాహన కల్పించడం ద్వారా, వారు ఈ సమస్యలను అధిగమించి, వారి విద్య మరియు సామాజిక జీవితంలో పాల్గొనేలా చేయవచ్చని అన్నారు. అంతేగాక బాల్యవివాహాల రహిత జిల్లా సాధనకై లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కిషోర్ ఈ బాలికలు గ్రామ మహిళ కార్యదర్శి (జి ఎం ఎస్ కె) వివోఏలు మరియు అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.