కడప జిల్లా: మన న్యూస్: మే 6: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో సోమవారం నాయకులు, కార్యకర్తల సమావేశం విజయ జ్యోతి నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ షర్మిల రాక సందర్భంగా ఏర్పాట్లపై నాయకులతో చర్చించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా నాయకులతో షర్మిల పార్టీ అభివృద్ధికి దిశా నిర్దేశం నిర్దేశం చేస్తారన్నారు. పర్యటన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని చెప్పారు. సమావేశంలో నగర అధ్యక్షులు అఫ్జల్ ఖాన్, డిసిసి ఉపాధ్యక్షులు సిరాజుద్దీన్, కదిరి ప్రసాద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి గౌస్ పీర్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిళ్ళ బాబు, మైనార్టీ జిల్లా అధ్యక్షులు రహమతుల్లా ఖాన్, మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నీలం, మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఖాజా మైనుదిన్, మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీఖ్ ఖాన్ , క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు పిడి సంజయ్ కాంత, శ్యామలమ్మ, సునీత అబ్దుల్ సత్తార్ హరి ప్రసాద్.ఋ గంగయ్య హమీద్, అబ్ధుల్ సత్తార్, హరి ప్రసాద్, గంగయ్య, పాలగిరి శివ, మహబూబ్ బాషా పాల్గొన్నారు.