కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 6: బద్వేల్ మండలంలోని చింతపుతాయపల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డి సోమవారం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు బోడపాడు రామసుబ్బారెడ్డి కలిసి మృతి చెందిన నాగిరెడ్డి భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీలో నాగిరెడ్డి కృషిని కొనియాడారు. ఆ కుటుంబానికి పార్టీ అన్ని వేలల అండగా ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోసి రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, బూత్ కన్వీనర్ జయరాం రెడ్డి పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.