మన న్యూస్ తవణంపల్లె మే-5:- తవణంపల్లి మండల పరిధిలోని మత్యం పంచాయతీ సచివాలయ ఆవరణంలో వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం హార్టికల్చర్ అసిస్టెంట్ శ్రీధర్ మాట్లాడుతూ వాతావరణ సమాచారం రైతులకు డిజిటల్ పేమెంట్ వాతావరణ మరియు మార్కెట్లో ఈరోజు రేట్లు వివరాలు యూట్యూబ్ లో వ్యవసాయకు సంబంధించిన విషయాలు తెలుసుకునే విధంగా మరియు ప్రభుత్వ పథకాలు గురించి పూర్తి సమాచారంఎలాతెలుసుకోవాలని రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో సాయిల్ కన్జర్వేషన్
ఏవో భారతి, రైతు సేవ కేంద్రం ఇంచార్జ్ జ్యోతినాథ్, కళ్యాణ్, వెటర్నరీ అసిస్టెంట్ జాషువా పాల్, రైతులు పాల్గొన్నారు.