మనను సాలూరు మే 5: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గిరిజను లు సాగు చేస్తున్న భూములకు పట్టాల మంజూరు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాచిపెంట మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ర్యాలీ గా వెళ్లి నిరసన కార్యక్రమం జరిగింది, సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని అన్యాక్రాంతమైన భూములు గిరిజనులకు అప్పజెప్పాలని కోరుతూ తాసిల్దార్ రవికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం నాయకులు మజ్జి కృష్ణమూర్తి జి అనంత్ ఆదరిలో జరిగిన కార్యక్రమాలు సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన భూములకు రక్షణ కల్పించాలని వెంటనే పట్టాల మంజూరు చేయాలని పట్టాలు ఇవ్వకపోవడం వలన మా రాయి గుడ్డి వలస తాడూరు పంచాయతీలో ఉన్నటువంటి భూములు లో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదని బ్యాంకు రుణాలు అందటం లేదని ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు తెచ్చుకుని వ్యవసాయం చేసి నష్టపోతున్న పరిస్థితి ఏర్పడుతుందని, అలాగే ఈ భూములకు పట్టాలు కూడా మంజూరు చేయలేదని అన్నారు. అలాగే సరే వలస రెవెన్యూలో మేము సాగు చేస్తున్న భూములకు పెద్ద గడ్డ జలాశయంలో ఉన్న మడవలస తురిపాడు గ్రామ గిరిజనులకు పట్టాలు ప్రభుత్వం అందించడం వలన గిరిజనులకు, తగువులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని. ఆ గిరిజనులకు భూములు ఇవ్వాలి, మా భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వేలు చేయకుండా మా భూముల్లో పట్టాలి ఇవ్వకపోవడం వలన గిరిజనులు గొడవలు పడుతున్న పరిస్థితి ఏర్పడిందని ఇది పరిష్కారం చేయాలంటే మా భూములకు పట్టాలి ఇవ్వాలి, గిరిజనుల పోరాటానికి మద్దతునిస్తూ సిపిఎం జిల్లా నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ గిరిజనులు తాతల కాలం నుండి సాగు చేస్తున్న భూములకు నేటికీ పట్టాలు సక్రమంగా అందించకపోవడం వలన ఈ భూములు అన్యాక్రాంతమవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై రెవెన్యూ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు గత నెలలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేయడం జరిగిందని కలెక్టర్ ఆదేశాలను మండల స్థాయి అధికారులు పాటించి పేదలకు న్యాయం చేయాలని, సాగు పట్టాలు ఇవ్వాలని అన్యాక్రాంతం చేసినటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తాసిల్దార్ రవి మాట్లాడుతూ సాగు పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నం సీరియస్గా చేస్తామని, దీనిపైన ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని మేము తప్పనిసరిగా ఆ పంచాయతీలో ఉన్నటువంటి ప్రాంతాలు పర్యటించి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. పాచిపెంట మండలం తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నాయకులు గిరిజనులు పాల్గొన్నారు.