మన న్యూస్, నెల్లూరు, మే 5: నెల్లూరు ,శెట్టిగుంట రోడ్డు బర్మసెల్ దగ్గర రైల్వే స్థలాల్లో నివసిస్తున్న వారిని వైసీపీ నాయకులు తెల్లవారుజామున ముందస్తు సమాచారం లేకుండా ఇల్లు కూల్చిన సంగతి ప్రజలు ఇంకా మర్చిపోలేదు.కల్లబొల్లి మాటలు చెప్పే నాయకులు ఇక్కడ ప్రజలకు వారి ప్రభుత్వం హయాం లో పట్టాలు ఎందుకు ఇవ్వలేదు అనేది తేల్చాలి…అది జరిగే పని కాదు అనే జనసేన నేత గురుకుల కిషోర్ అన్నారు.కూటమి ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు సత్వరమే టిట్కో హౌసెస్ లో నివాసం ఏర్పాటు చేసిన తర్వాతనే ఎంక్రోచ్మెంట్ ఉంటుంది అని తెలిపారు.ఎమ్మార్వో , కమిషనర్ మరో గంటలో ఇక్కడికి వచ్చి వారి వివరాలు సేకరించి ప్రత్యామ్నాయలను ఏర్పరుస్తున్నారు అని అన్నారు.గత ఆరు నెలలుగా రైల్వే స్థలాలను ఖాళీ చేయించాల్సిన సంగతిని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళుతున్న తరుణంలో ఇప్పటికిప్పుడేదో నిర్ణయం తీసుకున్నట్టు వైసిపి నాయకులు హడావుడి చేయడాన్ని ఖండిస్తూ స్థానికులను జనసేన నాయకులు కిషోర్ గునుకుల వారిని కలిసి భరోసా ఇచ్చారు.ఎవరైతే ఇల్లు కలిగి ఉన్నారో వారు పోను మిగిలిన వారిని ఎమ్మార్వో మరియు కమిషన్ పరిశీలించి టిడ్కో హౌసెస్ లో ప్రత్యామ్నాయం నివాసం ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ కటటడాలు కూల్చి వేయడం జరుగుతుంది అని అన్నారు.
ప్రతిపక్ష నాయకులు కూడా దీన్ని వక్రీకరించకుండా ఎప్పటికైనా కేంద్ర రైల్వే ప్రభుత్వ స్థలాలు వారికి అప్పజెయ్యాల్సిన బాధ్యతను ముందుకు తీసుకెళ్లాలని అని తెలిపారు.స్థానికుల సహకారంతో ప్రతి ఒక్కరికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిన తర్వాతనే ఇక్కడ అక్రమాలు కొల్చడం జరుగుతుందని భరోసా ఇచ్చారు.పాక్షికంగా ఇచ్చిన టిడ్కో హౌసెస్ లో కూడా సదుపాయాలు కల్పించే బాధ్యతను కోటమి ప్రభుత్వం కల్పిస్తుంది స్థానికులు సహకరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన సిటీ పర్యవేక్షకులు,ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,వారి సతీమణి విజయలక్ష్మి,జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,పట్టణ కార్యదర్శి హేమచంద్ర యాదవ్,జనసేన నాయకులు యాసిన్, శాంభవి,నరహరి తదితరులు పాల్గొన్నారు.