మన న్యూస్ ,కోవూరు, మే 5:- గ్రామాలలో తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, లాంటి మౌళిక సదుపాయాలు కల్పించి తనను భారీ మెజారిటీతో గెలిపించిన కోవూరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం ఆమె కోవూరు పంచాయతి పెళ్లకూరు కాలనీ పరిసరాలలోని 4,5,6 వార్డులలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా రెవెన్యూ, పంచాయతి మరియు సచివాలయ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇల్లిల్లూ తిరుగారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇల్లు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై స్థానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. రానున్న మలి విడత 15 వ ఆర్ధిక సంఘ నిధులతో పెళ్లకూరు కాలనీలో రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని కోరారు. సర్పంచ్ మరియు పంచాయతి అధికారులు మెరుగైన పారిశుధ్య నిర్వహణ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. అధికారులు, నాయకులు ప్రభుత్వ పధకాలు వాటికి కావాల్సిన అర్హతల గురించి ప్రజలకు వివరించాలని కోరారు. ఎన్నికల సందర్భంగా చేసిన ప్రతి హామీ నెరవేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని దశల వారీగా సంక్షేమ పధకాలు అమలు జరుగుతుందన్నారు. గత నెల 16 వ తేదిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు పంచాయతిలోని 8,9 వార్డులలో పబ్లిక్ గ్రీవెన్స్ సందర్భంగా స్థానికులు ఆమె దృష్టికి తెచ్చిన పలు సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం చూపిన వైనాన్ని ఆమె ప్రజలకు వివరించారు. కోవూరు పంచాయతి పరిధిలోని. గుంట కయ్యలు ప్రాంతంలో 11 లక్షలతో సిసి రోడ్డు, 4 లక్షల 60 వేలతో సైడ్ డ్రైన్లు 1 లక్ష 30 వేలతో తాగునీటి బోర్ మరియు 1 లక్ష 44 వేలతో ఇంటింటికి కొళాయి పైప్ లైన్ తదితర పురోగతి వివరాలను ఆమె ప్రజలకు వివరించారు. తాలూకా ఆఫీసు రోడ్డులో 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న “అన్నక్యాంటిన్” నిర్మాణ పనులు చేపట్టడంలో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్ ను తొలగించి కొత్త కాంట్రాక్టర్ కు పనులు అప్పగించినట్లు ఆమె తెలిపారు. మరి కొన్ని నెలలలో కోవూరులో “అన్నక్యాంటిన్” సేవలు అందుబాటులోనికి రానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నిర్మలానంద బాబా, ఎంపీడీఓ శ్రీహరిరెడ్డి, కోవూరు సర్పంచి యాకసిరి విజయమ్మ, ఎంపీపీ తుమ్మల పార్వతి, పెన్నాడెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాలరెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి. స్థానిక నాయకులు గాదిరాజు అశోక్, పిచ్చుక మధుసూదన్, బెల్లంకొండ విజయ్, చప్పిడి సాయి, బెల్లంకొండ గోవిందు, టవి కుమార్, కాసారం చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.