శంఖవరం మన న్యూస్ (అపురూప్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శంఖవరం మండల క్రిస్టియన్ విభాగానికి అధ్యక్షునిగా పాస్టర్ నాగబత్తుల ప్రేమ్ కుమార్ నియమితులయ్యారు. గతంలో ఈయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేసిన విశేష సేవలకు గాను ఈ గుర్తింపు లభించిందని పలువురు పార్టీ కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ ముద్రగడ గిరి బాబు మాట్లాడుతూ, రాబోవు రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, పార్టీ మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిస్తూ, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శంఖవరం మండల అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా శంఖవరం మండలంలో గల పాస్టర్లు, క్రైస్తవ సంఘ మత పెద్దలు, క్రైస్తవ సంఘల సభ్యులు నాగ బత్తుల ప్రేమ్ కుమార్ కి అభినందనలు తెలిపారు.