మన న్యూస్, ఎస్ఆర్ పురం:- చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర యాదవ సాధికార సమితి అధ్యక్షులు నాగేశ్వర యాదవ్ కర్నూలు డిసిఎంస్ చైర్మన్ ను చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిత్తూరు జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన డిసిఎంసి నాగేశ్వర్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, నంద్యాల బీసీ సాధికార అధ్యక్షులు గురప్ప యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.