ఎస్ఆర్పురం, మే 4 (మన న్యూస్):-"సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి. మానవసేవయే మాధవసేవ" అని పుల్లూరు మహిళా పోలీస్ కీర్తి తెలిపారు. ఆదివారం ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని కార్వేటినగరం మండలంలో సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.రాస్ రాష్ట్రీయ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన ఆమె, అనంతరం ఎస్ఆర్పురం అటవీ ప్రాంతాల్లో జీవించే పేదలకు కూడా అన్నదానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా పోలీస్ కీర్తి – "జీవితంలో ఎంత ఎదిగినా, మన లో ఓదార్పు ఉండాలి. మనం చేసే సేవే నిజమైన పూజ" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువనేత సాఫ్ట్వేర్ బాలు పాల్గొని, కీర్తి చేసిన సేవా కార్యక్రమాలను అభినందించారు. కార్యక్రమం సేవా స్పూర్తితో సాగింది.